*కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా*
*04 మార్చ్ 2025*
బెజ్జూర్ మండల కేంద్రానికి చెందిన ముస్తక్ హుస్సేన్ బెజ్జూర్ సామాజిక ఆసుపత్రిలో కాంటిజెంట్ వర్కర్గా గత 35 సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్నారని ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అవినాష్ తెలిపినారు. ఎందుకుగాను ఆయనను సిబ్బందితో కలిసి శాలువతో ఘనంగా సన్మానించి సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రికి సంబంధించి అన్ని తానై అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ అన్నారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్యం ఆస్పత్రి పర్యవేక్షణ అటెండర్, స్వీపర్, వాచ్మెన్ ఎవ్వరూ లేని సమయంలో అన్ని తానై ఆసుపత్రిని మరియు సిబ్బందికి గ్రామ ప్రజలకు గత 35 సంవత్సరాల నుండి అవిశ్రాంతంగా సేవలందిస్తున్నారని తెలిపారు. ఆయన చేస్తున్న సేవలు మరియు జీవితం ఇతర ఉద్యోగులకు ఆదర్శమని కొనియాడినారు. ఆసుపత్రిలో ఉన్నత ఉద్యోగంలో ఎదగాలని, ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం సిబ్బందితో కలిసి 35 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్నందుకు కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫార్మసిస్ట్ ఆయేషా, పీ.హెచ్.ఎన్. కమల, ల్యాబ్ టెక్నీషియన్ రాజు, స్టాఫ్ నర్స్ మండల, ఏఎన్ఎంలు ,ఆశా కార్యకర్తలు తదితరలు పాల్గొన్నారు…