నేటి గదర్ న్యూస్,పినపాక:
పినపాక తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పదోన్నతిపై బాధ్యతలు స్వీకరించిన ఆర్ ఐ 1 గణపతిని గడ్డంపల్లి గ్రామ యూత్ మంగళవారం తహశీల్దార్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… చిన్న వయసులోనే ఆర్ ఐ 1 గణపతి తన తండ్రి సర్వీసులోనే మృతి చెందినప్పటికిని ఆత్మవిశ్వాసం కోల్పోలేదు అని అన్నారు. అనంతర కాలం లో ప్రభుత్వం నిబంధనల మేరకు ప్రభుత్వం జూనియర్ అసిస్టెంట్ గా నియమించడం జరిగిందని… చిన్న వయసులోనే అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విధి నిర్వహణ లో వివాద రహితుడిగా పేరు తెచ్చుకోవడం తోపాటు… ఉన్నతాధికారుల మన్ననలు. RI ౼1 గణపతి పొందారని గుర్తు చేశారు. అనంతరం ఇటీవలే ప్రభుత్వం కల్పించిన పదోన్నతుల లో భాగంగా ఆర్ ఐ 1 గా పినపాక తాసిల్దార్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించడం సంతోషించదగ్గ పరిణామం అన్నారు. తన రెవెన్యూ పరిధిలోని గ్రామాల ప్రజలకు సకాలంలో సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.అలాగే భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పడిగా. ప్రకాష్, కలివేటి. ప్రణయ్ కుమార్,రేగ. హరి ప్రసాద్, ఆవుల. శ్రీను, కలివేటి.సుమన్, కలివేటి. ప్రశాంత్, కలివేటి.సన్నీ, కలివేటి.పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు