రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 4:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి.ఈ సందర్బంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ మల్లేశం మంగళవారం నాడు విలేకరులతో మాట్లాడుతూ జూనియర్ కళాశాలలో 215 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.ఈ పరీక్షలకు సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అందుకోసం కళాశాల విద్యార్థులు పరీక్షల సమయానికి గంట ముందు హాజరు కావలసి ఉంటుందని పేర్కొన్నారు.ఈ పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ముందు జాగ్రత్త చర్యగా త్రాగునీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.ఈ పరీక్షలు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీసీ కెమెరాల నిఘా నీడలో పకడ్బందీగా చర్యలు తీసుకొని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
