నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 04: అశ్వారావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మంగళవారం నియోజకవర్గంలో పలు కుటుంబాలను పరామర్శించారు. దమ్మపేట మండలం, అంకంపాలెం గ్రామంలో పెరాలసిస్ తో బాధపడుతున్న పెనుబల్లి నానారావుని పరామర్శించి మెరుగైన వైద్యం అందించేందుకు కృషిచేసి ఫిజియోథెరపీ అందిస్తానని హామీ ఇచ్చారు, అనంతరం అశ్వారావుపేట మండలం సున్నంబట్టి గ్రామంలో పైదా మోహన్ రావు అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. అదే గ్రామంలో ట్రాక్టర్ ప్రమాదంలో వగ్గెల నరేష్ గారి 18 నెలల కుమారుడు ధనుష్ కుమార్ అకాల మరణం చెందగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలన్నారు ఏదైనా సహాయం కావాలంటే తనకు తెలియచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 34