రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 4:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో స్థానిక ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో ఉన్న న్యాక్ కార్యాలయం ఇన్చార్జి రామకృష్ణ చారి మరియు డేమాన్ స్టేటర్ ఐలయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం 30 మంది తాపీ మేస్త్రీలతో శిక్షణ ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిక్షణ ఈ నెల 3 నుండి 8 శనివారం వరకు ఇందిరమ్మ ఇండ్ల నమూనా నిర్మాణంపై 6 రోజుల పాటు వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.తాపీ మేస్త్రీలకు ఈ శిక్షణ కాలంలో భోజన వసతులు కల్పించినట్లు తెలిపారు.ఈ శిక్షణ అనంతరం తాపీ మేస్త్రీలకు ఉచితంగా సర్టిఫికెట్ ఇవ్వబడుతుందని పేర్కొన్నారు.ఈ శిక్షణ కార్యక్రమంలో న్యాక్ సిబ్బంది తాపీ మేస్త్రీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post Views: 238