నేటి గదర్ న్యూస్, చింతకాని మండల ప్రతినిధి, గుడిది పిచ్చయ్య
నేటి గదర్ డిజిటల్ న్యూస్ 2025 క్యాలెండర్ ని చింతకాని మండలం తహసీల్దార్ అనంతరాజు,ఎం పి డి ఓ శ్రీనివాస రావు, ప్రభుత్వ వైద్యులు అల్తాఫ్, మరియు సబ్ ఇన్స్పెక్టర్ నాగుల్ మీరా ఆవిష్కరించారు. సాంకేతిక పెరిగిన ఈ రోజుల్లో నేటి గద్దర్ డిజిటల్ డైలీ న్యూస్ వేగవంతమైన వార్తలు అందించడం అభినందనీయమన్నారు. రానున్న రోజులలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని, చింతకాని ప్రతినిధి పిచ్చయ్యను వారు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో నేటి గదర్ చింతకాని ప్రతినిధి పిచ్చయ్య తో పాటుగా, చింతకాని మండల సామజిక కార్యకర్త గుండ్ల రాంబాబు, చింతకాని పోలీస్ స్టేషన్ ఏ యస్ ఐ, ప్రభుత్వ హాస్పిటల్ సూపెర్వైజర్ కృష్ణారావు, యూడీసీ పల్లవి, ల్యాబ్ టెక్నీషియన్ సైదులు, డి ఈ ఓ ఉదయ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.
Post Views: 60