+91 95819 05907

రాజ్యాంగ పరిరక్షణకై బిఎస్పి తో కలిసి రండి : తడికల శివకుమార్

బహుజన సమాజ్ పార్టీ వాజేడు మండల నూతన కమిటీ నియామకం

వాజేడు మండల అధ్యక్షులుగా కారం చిరంజీవి

నేటి గద్దర్ వాజేడు ప్రతినిధి
రాజ్యాంగ పరిరక్షణకై బహుజన సమాజ్ పార్టీతో కలిసి రావాలని బీఎస్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కొత్తగూడెం జిల్లా ఇన్చార్జి, భద్రాచల నియోజకవర్గ అదన పించార్జి తడికల శివకుమార్ అన్నారు. మంగళవారం వాజేడు మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ముఖ్య నాయకుల సమీక్ష సమావేశం భద్రాచలం నియోజకవర్గం ఉపాధ్యక్షులు, వాజేడుమండల ఇన్చార్జి కుమ్మరి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి విచ్చేసిన పాత్రికేయుల ముఖాముఖిలో శివకుమార్ మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ. రాజ్యాంగ రక్షణకై పాటు పడుతుందని, రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 12 నుండి 35 వరకు ఉన్న ప్రాథమిక హక్కుల సంరక్షణకై నిరంతరం పోరాడుతుందని తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలు ప్రాంతంలో 1950 కి పూర్వం నివసిస్తున్నటువంటి అన్ని వర్గాల ప్రజలని ఎస్టీ జాబితాలో చేర్చాలని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగపరంగా చెప్పినప్పటికీ పాలక ప్రభుత్వాలు అది నెరవేర్చటంలో వైపల్యం చెంది కొన్ని వర్గాల మధ్య అనేక సమస్యలకు కారణమైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఆర్టికల్ 14, ఆర్టికల్ 17, ఆర్టికల్ 21, అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, వాటి పరిష్కారం కొరకు బహుజన్ సమాజ్ పార్టీలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఆధిపత్య కులాలలోని పేదలు మహిళలు, బి ఎస్ పి కి రాజ్యాధికారం అందించడం ద్వారా సమస్యలన్ని పరిష్కారం అవుతాయని పునరుద్ఘాటించారు. ఎస్సీ ఎస్టీ బీసీలు మత మైనార్టీలు, బహుజన సమాజ్ పార్టీ చేసే సామాజిక ఉద్యమానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. అనంతరం నియోజకవర్గ అధ్యక్షులు కొండ చరణ్ వాజేడు మండల అధ్యక్షునిగా కారం చిరంజీవికి నియామక పత్రాన్ని అందించి నియమించారు. ఈ సందర్భంగా కొండ చరణ్ మాట్లాడుతూ భవిష్యత్తు రాజకీయాలు బహుజన వాదానిదేనని, ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనులు అంతా బిఎస్పి తో కలిసి రావాలని కోరారు. అదేవిధంగా కారం చిరంజీవి తన మండల కమిటీ సభ్యులకు నియామక పత్రాలు ఇచ్చి నియమించుకున్నారు. వాజేడు మండల ఉపాధ్యక్షులుగా దుర్గం దేవ సహాయం, ప్రధాన కార్యదర్శిగా జనగం కేశవరావు, కోశాధికారి జాడి రామకృష్ణ, కార్యదర్శి సాధనపెళ్లి మోహన్ రావు, మండల ఇసీ నెంబర్ కుమ్మరి స్వర బాబు లు నియమించారు. ఎన్నికైన కమిటీ సభ్యులు సెక్టార్ అధ్యక్షులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కావేరి మధు, సప్పిడి సాంబశివరావు, కుమ్మరి ఏసు, సప్పిడి రాంబాబు, సప్పిడి బాబు, ఎస్.కె అజ్జు, గజ్జల శివ, గజ్జల శేషు కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !