రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 4 :- మెదక్ జిల్లా రామాయంపేట టౌన్ మెదక్ రోడ్డులో అంబేద్కర్ చౌరస్తా వద్ద మంగళవారం రోజు సాయంత్రం అందాజ 5 గంటల (30) నిమిషాలకు గంగాపూర్ తాండాకు చెందిన అజ్మీర విట్టల్ తండ్రి మంగ్య వయసు 30 సంవత్సరాలు కులం ఎస్టి లంబాడ అను వ్యక్తి కి సిద్ధరాములు అను వ్యక్తి నుండి డబ్బులు ఇప్పియమంటూ న్యూసెన్ చేస్తుండగా పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న జి.మల్లికార్జున్ ఏఎస్సై మరియు అతనితో పాటు గల సిబ్బంది అతని దగ్గరకు వెళ్లి సముదాయిస్తు ఉండగా వినకుండా వారి విధులకు ఆటంకం కలిగిస్తూ డబ్బులు ఇప్పియ్యండి.లేదంటే స్ట్రీట్ లైట్ పోలెక్కి దూకి చనిపోతాను అంటూ అంబేద్కర్ చౌరస్తాలో గల వీధిలైట్ పోలెక్కి పోల్ పైనుండి దూకి చనిపోతాను అంటూ బెదిరించినాడు.అని ఫిర్యాదు రాగా అట్టి వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగినది.ఎవరైనా వ్యక్తులు పబ్లిక్ సర్వెంట్స్ ని వారి విధులు నిర్వహించకుండా అడ్డుపడి, చనిపోతానంటూ బెదిరించిన అట్టి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని రామాయంపేట పోలీసులు తెలుపుతున్నారు.
