నేటి గదర్ వెబ్ డెస్క్:
*2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది.* దుబాయ్ వేదికగా మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన *సెమీ ఫైనల్లో 4 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.* 265 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 6 వికెట్లు కోల్పోయి 48.1 ఓవర్లలో ఛేదించింది. రాహల్ (42*) మ్యాచ్ ముగించాడు. విరాట్ కోహ్లీ (84 పరుగులు) సూపర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టగా, అయ్యర్ (45) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 2, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కూపర్ కనోలీ ఒక్కో వికెట్ పడగొట్టారు. 265 పరుగుల లక్ష్య ఛేదనలో గిల్ (8) ఫెయిల్ అయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (28 పరుగులు), అక్షర్ పటేల్ (27 పరుగులు) ఫర్వాలేదనిపించారు. చివర్లో హార్దిక్ పాండ్య (28 పరుగులు) రాణించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (73 పరుగులు), అలెక్స్ కేరీ (61 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించారు. ట్రావిస్ హెడ్ (39 పరుగులు) ఫర్వాలేదనిపించాడు. టీమ్ఇండియా బౌలర్లలో మహ్మద్ షమీ 3, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి చెరో 2, అక్షర్ పటేల్. హార్దిక్ పాండ్య 1 వికెట్ దక్కించుకున్నారు.
తాజా విజయంతో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుసగా మూడుసార్లు (2013, 2017, 2025) ఫైనల్కు దూసుకెళ్లింది. ఇక బుధవారం జరగనున్న రెండో సెమీస్ (న్యూజిలాండ్- సౌతాఫ్రికా) విజేతతో టీమ్ఇండియా ఫైనల్లో తలపడనుంది. ఈ మ్యాచ్ మార్చి 9న దుబాయ్ వేదికగా జరగాల్సి ఉంది.