నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి:
నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకుడు కుక్కల సత్యానందం (70) గత రాత్రి అకాల మరణం చెందారు.. ఈ విషయం తెలుసుకున్న పాలేరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ కొండబాల కరుణాకర్,టిడిపి జిల్లా కార్యదర్శి నాగార్జునపు శ్రీనివాసరావు, నేలకొండపల్లి మండల టిడిపి అధ్యక్షుడు ఆరెకట్ల కొండలరావు, గ్రామ టిడిపి నాయకులతో కలిసి సత్యానందం పార్థివ దేహానికి నివాళులర్పించారు.. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 5,000 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి నాయకులు కారంగుల వీరబాబు, మందడపు హనుమంతరావు, కుక్కల సీతయ్య, మారగాని చిన్న సత్యనారాయణ, మారగాని రాజశేఖర్(DJ) మారగాని గోవర్ధన్, కాంగ్రెస్ నాయకులు ఎడవెల్లి సైదులు, మల్లెల రవికుమార్, గండారపు వెంకటలక్ష్మి, తదితరులు ఉన్నారు.
Post Views: 21