నేటి గదర్ న్యూస్,ఖమ్మం జిల్లా ప్రతినిధి.
ఖమ్మం జిల్లా కేంద్రంలో గల ప్రధాన హాస్పిటల్ లో గత 5 సంవత్సరాల నుంచి పేషెంట్స్ సహాయకులుకు మధ్యాహ్నం ఉచితంగా అన్నప్రాసదం (భోజనం) ఏర్పాట్లు చేస్తున్న శ్రీ సత్యసాయి నిత్యాన్నదాన సేవా కేంద్రాన్ని ఖమ్మం కలెక్టర్ పర్యవేక్షించారు.పేషెంట్స్ సహాయకులకు సేవా కేంద్రం వారు అందిస్తున్న ఆహారాన్ని వడ్డీంచి ఆహారం రుచి గా ఉందా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే వారు ఆహారం తయారు చేయు విధానం గురించి ట్రస్ట్ సభ్యులును అడిగి తెలుసుకొన్నారు. ఈ కార్యక్రమంలో, ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ ఆర్ ఎం ఓ కిరణ్ కుమార్, శ్రీ సత్యసాయి సేవా సమితి ఖమ్మం స్పరిట్యుయల్ కోఆర్డినేటర్ నరసింహమూర్తి, మరియు నిత్యాన్నదాన సేవా కేంద్రం ఇంచార్జి రామారావు, సత్య సాయి బాబా సేవకులు పాల్గొన్నారు. ఈ సేవా కేంద్రం తరుపున ప్రజలకు మంచి చేస్తున్న ట్రస్ట్ సభ్యులును కలెక్టర్ అభినందించారు.
