★న్యాయం చేయండి మహాప్రభో
★నా నౌకరిని నాకు ఇప్పించండి.
★పట్టణంలో మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి భిక్షాటన
నేటి గదర్ న్యూస్,
మణుగూరు : న్యాయం చేయండి మహాప్రభో నా నౌకరిని నాకు ఇప్పించండి అంటూ పట్టణంలోని పూల మార్కెట్ సెంటర్లో మణుగూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఓ ఔర్ స్టార్టింగ్ ఉద్యోగి వినూత్నంగా బిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉద్యోగం లేకపోతే తన కుటుంబ వీధి పాలు కావటం ఖాయమని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 2014 సంవత్సరం నుండి మణుగూరు మున్సిపాలిటీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహించిన తనకు గత రెండు సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ జరగడంతో ఆరోగ్యం క్షేనించింది. తాను మళ్ళీ కోలుకున్న తర్వాత విధులకు వెళితే అప్పటినుండి ఇప్పటివరకు తనకు పని కల్పించకుండా అనేక రకాలుగా మున్సిపాలిటీ అధికారులు అవమానకరంగా మాట్లాడుతున్నారని, ఆవేదన చెందారు. ఒకవైపు ఆరోగ్యం బాగాలేక పోవటం, మరోవైపు ఉద్యోగం లేకపోవడంతో తనకు కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. తనకు ఉద్యోగం కల్పించాలని మునిసిపల్ అధికారులను పదేపదే ప్రాధాయపడిన, న్యాయం చేయాలని కమిషనర్లను కోరిన తనను ఇప్పటివరకు వీధుల్లోకి తీసుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. సుమారు ఐదుగురు కమిషనర్లు మారినా తనకు న్యాయం జరగలేదన్నారు. సదర విషయానికి జిల్లా కలెక్టర్ గారికి విన్నవించి కలెక్టర్ గారు కూడా నా ఆరోగ్య పరిస్థితిని గమనించి తనను వీధిలోకి తీసుకోమని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చినా కలెక్టర్ గారి ఆదేశాలు పట్టించుకోకపోవడం తనను మరింతగా బాధించిందన్నారు. మరోవైపు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కొందరు అధికారులు, ఉద్యోగులు. ఓ మహిళ అధికారి తనను వికలాంగుడిననీ, మీరు పని చేయరు, మీరు మున్సిపాలిటీ ఉద్యోగానికి పనికిరారు అంటూ తనను మానసికంగా, ఇబ్బంది పెట్టిన ఘటనలు అనేక ఉన్నాయని ఆయన తెలిపారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు నాపై, నా కుటుంబం పై దయవుంచి, నాకు న్యాయం చేయగలరని, నా ఉద్యమం నాకు ఇప్పించగలరని, ఈ బిక్షాటన కార్యక్రమం ద్వారా వేడుకుంటున్నాను.