కారేపల్లి: నేటి గదర్ న్యూస్: ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలు, ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు కై ప్రజలను చైతన్యపరిచి సిపిఎం పోరాడుతుందని వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం అన్నారు. బుధవారం సిపిఎం సింగరేణి మండల కమిటీ సమావేశం రేగళ్ల మంగయ్య అధ్యక్షతన జరగగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చాయని అమలు చేయడంలో మాత్రం అలసత్వం నిర్లక్ష్యం వహిస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయని భూక్య వీరభద్రం విమర్శించారు. నరేంద్ర మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామని, కనీస మద్దతు ధర చట్టం వంటివి ఎన్నో హామీలను ఇచ్చి మరిచారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు,420 హామీల అమలు నత్తనడకన సాగుతున్నదని అమలులో అనేక నిబంధనలు పెట్టి రైతు రుణమాఫీ,రైతు భరోసా,గ్యాస్ సబ్సిడీ,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,ఇందిరమ్మ ఇండ్లు మహిళలకు 2500 సహకారం వంటివి ఏవి అనేక నిబంధనలు పెట్టి అమలు చేయకుండా చేసే ప్రయత్నం జరుగుతున్నదని దీని కారణంగా లబ్ధిదారులు నష్టపోతున్నారని దీనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూల్యంను చెల్లించుకుంటుందని విమర్శించారు. ఈ ప్రజా సమస్యల పరిష్కారానికై సిపిఎం ప్రజలను చైతన్య పరిచి పోరాడుతుందని సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు ప్రజలు సమరసిల పోరాటం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు మండల కార్యదర్శి కే నరేంద్ర ,మండల నాయకులు కొండబోయిన ఉమావతి , వల్లభనేని మురళి, సురభాగ ధనమ్మ, కేశ గాని ఉపేందర్, బానోత్ కిషన్, ధరావత్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.
