హెచ్ ఆర్ సి, బి ఏ ఎస్ ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు తంబర్ల నరసింహారావు.
జూలూరుపాడు : నేటిగదర్ న్యూస్ :మండల పరిధిలోని పోలీస్ స్టేషన్ ఏరియాలో పాపకొల్లు క్రాస్ రోడ్డు ఏరియాలో పాత బస్టాండ్ ఏరియాలో అంబేద్కర్ సెంటర్ పరిధిలో వికాస్ డిగ్రీ కాలేజ్ ఏరియాలతోపాటు రెవెన్యూ మండల డెవలప్మెంట్ కరెంట్ సబ్ స్టేషన్ ఏపీఓ వివిధ కార్యాలయాలు ఉన్న చోట చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని హ్యూమన్ రైట్స్ సొసైటీ బహుజన అభ్యుదయ సేవా సమితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు తంబర్ల నరసింహారావు సంబంధిత అధికారులను కోరారు.మార్చి మొదటి వారంలోనే విపరీతమైన ఎండలు కావున తక్షణమే మండల పరిధిలో చదివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలు వారి అవసరాల నిమిత్తం ప్రతి పనికి మండల హెడ్ క్వార్టర్ కు వివిధ గ్రామాల నుండి వచ్చేటటువంటి ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించి వారి దాహార్తి తీర్చాలని ఆయన సంబంధిత అధికారులను కోరారు.