★సోషల్ వర్కర్ షేక్ లతీఫ్ ఆధ్వర్యంలో
వైరా :నేటి గదర్ న్యూస్, మండలం లోని సిరిపురం కేజీ ఉన్నత పాఠశాల నందు సిరిపురం గ్రామ నివాసి (గర్భిణీ స్త్రీలకు ఉచిత ఆటో సర్వీస్ నిర్వహిస్తున్న, సోషల్ వర్కర్ షేక్ లతీఫ్ ఆధ్వర్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అయినటువంటి ప్యాడ్స్, పెన్నులు వైరా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వర ప్రసాద్ చేతుల మీదగా ఈరోజు విద్యార్థులకు అందజేయడం జరిగినది. అనంతరం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ని శాలువాతో ఘన సన్మానం చేయడం జరిగినది. గత ఐదు సంవత్సరాల నుండి ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులకు సోషల్ వర్కర్ షేక్ లతీఫ్ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. గ్రామ పెద్దలు,ఉపాధ్యాయ బృందం షేక్ లతీఫ్ ను అభినందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్మ, పాఠశాల సిబ్బంది గ్రామ పెద్దలు విద్యార్థులు పాల్గొన్నారు.