రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 5:- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ ప్రజలకు మున్సిపల్ కమిషనర్ శుభవార్త ప్రకటించారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎం దేవేందర్ మాట్లాడుతూ ఈ నెల మార్చి 31 2025 లోగా ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించండి 25% తగ్గింపు రాయితీ పొందవచ్చని తెలిపారు.మున్సిపాలిటీలోని
పట్టణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా 2020 సంవత్సరంలో రూ. 1000 చెల్లించి ఎల్ఆర్ఎస్ కొరకు రిజిస్టర్ చేసుకున్న ప్లాటు యజమానులకు ప్రభుత్వం మార్చి 31వ తేది 2025 లోగా పూర్తి ఫీజు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.కావున ఇట్టి సదావకాశాన్ని మున్సిపాలిటీ ప్రజలు వినియోగించుకొని మీ యొక్క ప్లాటును క్రమబద్దీకరించుకోవాల్సిందిగా తెలియజేశారు.
Post Views: 69