రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 5:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో న్యాక్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై మండల వ్యాప్తంగా 30 మంది తాపీ మేస్త్రీలకు ఆరు రోజుల పాటు ఇస్తున్న శిక్షణ కార్యక్రమానికి బుధవారం నాడు జిల్లా హౌసింగ్ శాఖ పీడీ.మాణిక్యం హాజరయ్యారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై తాపీ మేస్త్రీలు తయారు చేస్తున్న నమూనా నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు.అనంతరం ఆయన శిక్షణ కార్యక్రమంలో తాపీ మేస్త్రీలతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం శిక్షణ తీసుకుంటున్న తాపీ మేస్త్రీలు ప్రభుత్వం ఇచ్చిన కొలతలకు అనుగుణంగా ఇండ్ల నిర్మాణం చేపట్టాలని తెలిపారు.ఈ ఇండ్ల నిర్మాణాలు పకడ్బందీగా నిర్మాణం చేయాలని తాపీ మేస్త్రీలకు సూచించారు.ఈ కార్యక్రమంలో డిఈ యాదగిరి ఏఈ విద్యాసాగర్ మరియు న్యాక్ ఇన్చార్జి రామకృష్ణ చారి,డేమాన్ స్టేటర్ ఐలయ్య,తాపీ మేస్త్రీలు పాల్గొన్నారు.
