రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 5:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన ఓ నిరుపేద వధువు శరణ్య బిందు వివాహానికి దాతలు ముందుకు వచ్చారు.రామాయంపేట పట్టణంలోని దుర్గమ్మ బస్తిలో ఉంటున్న నిరుపేద కుటుంబం అయిన వధువు శరణ్య బిందు, వివాహానికి పట్టణానికి చెందిన దాతలు సంకల్ప పౌండేషన్ ఆధ్వర్యంలో 17 వేల రూపాయలు క్వింటల్ బియ్యాన్ని అందజేశారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన శరణ్య బిందు అమ్మమ్మ లలిత తన వంతు సహాయంగా కొంత డబ్బు సమకూర్చగా ఈ విషయాన్ని ఫౌండేషన్ సభ్యులు తెలుసుకొని తాము కూడా అండగా ఉంటామని ముందుకు వచ్చారు.ఇందులో భాగంగా 17 వేల రూపాయలతో పాటు గజవాడ నాగరాజు క్వింటల్ బియ్యాన్ని అందించారు.నిరుపేద కుటుంబాలకు సంకల్ప పౌండేషన్ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గజవాడ నాగరాజు.ఎస్.కె అహ్మద్. చింతల యాదగిరి.నవీన్.మల్లేశం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
