ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం లో ఉన్న ఇంటింటికి నిత్యవసర సరుకుల పంపిణీ కి చెందిన మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ అపరేటర్లు ను గత ప్రభుత్వం ఫిబ్రవరి 2021 నుండి 2027 వరకు అగ్రిమెంట్ రూపంలో ముద్ర లోన్ క్రింద ఆయా కార్పొరేషన్ ల ద్వారా పకడ్బందీగా బ్యాంక్ ల తో కలసి 546000 రూపాయలు ఆపరేటర్ లకి అందించి వాహనాలు ఇవ్వడం జరిగింది. ఆపరేటర్లు బ్యాంక్ కి 60000 రూపాయలు కాంట్రిబ్యూషన్ చెల్లించారు.నెల నెల ప్రభుత్వం వారు కార్పొరేషన్ వారు కలసి 8896 రూపాయలు బ్యాంక్ ఆఫ్ బరోడా కి చెల్లించడం జరుగుతుంది.ఇప్పటికి రెండు సంవత్సరాలు మిగిలివుండగా యం.ఆర్.ఓ ఆఫీసు నుండి ఆఫీసు డి.టి మరియు ఆర్.ఐ లు యం.డి.యూ లని బెదిరించడం చేస్తున్నారు.నోటికి ఏ మాట వస్తే ఆ మాట ఆఫీసు డి.టి మాట్లాడడం క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించడం చేస్తున్నారు. ఇటీవల పొందూరు లో యం.డి.యూ ఆపరేటర్ ని బలవంతంగా రాజీనామా చేయించడం విశేషం. మొత్తం టంగుటూరు మండలం లో 11 మంది ఆపరేటర్లు ఉండగా,ఒకరి చే రాజీనామా చేయించగా మిగిలిన 10 మందిలో 8 మంది ఎస్సీ కులానికి చెందినవారు ఉండగా వారు ఆందోళన చెందుతున్నారు.వాహనాలు వారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉండగా వాటిని తొలగిస్తే కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియడం లేదని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం ఒక్కసారే లభిస్తుందని, అది పూర్తి కాకుండా బలవంతంగా లాక్కునే చర్యలను గౌరవ అధికారులు తగు న్యాయం చేసి అగ్రిమెంట్ పూర్తయ్యే వరకు యం.డి.యూ లకి న్యాయం చేయాలని కోరుతున్నారు.
