ఉమ్మడి మెదక్ – నిజామాబాద్ – అదిలాబాద్ – కరీంనగర్ నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఘనవిజయం సాధించిన అంజిరెడ్డి . ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ పట్టా బద్దుల ఎన్నికలలో ఘనవిజయం సాధించిన అంజిరెడ్డికి అభినందనలు తెలిపారు. కాగా ఇప్పటికే టీచర్స్ ఎమ్మెల్సీని బిజెపి బలపరిచిన అభ్యర్థి కైవసం చేసుకున్న విషయం విధితమే. ఈ రెండు విజయాలతో తెలంగాణ రాష్ట్ర భాజపా శ్రేణులలో నూతన ఉత్సాహం నెలకొన్నది. ఆయా జిల్లాల పరిధిలో అధికార కాంగ్రెస్ పార్టీ కి భవిష్యత్తులో ఏ ఎన్నిక జరిగిన అగ్ని పరీక్షగా నిలవన ఉందని విశ్లేషకుల అభిప్రాయం.కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపు
రెండో ప్రాధాన్యత ఓట్లతో అంజిరెడ్డి(బీజేపీ) విజయం
కౌంటింగ్ హాల్ నుంచి వెళ్లిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి
చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక సీఎం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేయగా ఒడిపోయిన కాంగ్రెస్ పార్టీ
మూడు జిల్లాలు తిరిగి రేవంత్ రెడ్డి ప్రచారం చేసినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి
కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా ఓడినా నాకు ఏం నష్టం లేదు అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న పట్టభద్రులు, ఉపాధ్యాయులు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని నిరుద్యోగులు, ఉద్యోగులు చాలా కష్టపడ్డారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం ఇవ్వకపోవడంతో నిరాశ చెందిన నిరుద్యోగులు