గీత కార్మికుని ప్రాణాన్ని కాపాడిన సేఫ్టీ కిట్
నేటిగద్దర్ న్యూస్, చింతకాని , . . ఈరోజుమధిర నియోజకవర్గం బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో కాటమయ్య రక్ష సేఫ్టీ కిట్టు తో రోజువారి కల్లుగీత వృత్తి చేస్తున్న బంధం పెద్ద గోవిందు ఎప్పటిలాగానే తాడిచెట్టు ఎక్కి దిగే క్రమంలో కాలుజారి పడిపోయే క్రమంలో కాటమయ్య రక్ష సేఫ్టీ కిట్టు వలన అతనికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆపింది. గ్రామస్తులు పక్కన ఉన్న రైతులు ప్రాణహాని, అంగవైకల్యం జరగకుండా గోవిందును కాపాడడం జరిగింది.
కల్లు గీత కార్మికులు అందరూ తప్పక తెలంగాణ ప్రభుత్వం అందజేసిన సేఫ్టీ కిట్ పరికరాలు వాడి తాటి చెట్టు ప్రమాదాల నుండి రక్షణ పొందుతూ ప్రాణాలను రక్షించుకోండి ఎక్సైజ్ శాఖ సూచన చేసింది.
Post Views: 328