+91 95819 05907

రెండున్నర దశాబ్దాల పోరాట ఫలితమే సాగర్ ఆయకట్టు కు గోదావరి జలాలు… బొంతు రాంబాబు.

సత్తుపల్లి, మధిర నియోజకవర్గ పరిధిలో సాగర్ ఆయకట్టు కు ప్రయోజనం.

డిజైన్ లో లేకుండా సత్వర వినియోగం కోసం లింక్ కెనాల్ పూర్తి చేసి గోదావరి జలాలు తరలింపు కు కృషి చేసిన మంత్రి తుమ్మల, వైరా శాసన సభ్యులు మాలోతు రాందాస్ నాయక్ కృషి అభినందనీయం.

ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కు పాలేరు అనుసంధానం సత్వరమే పూర్తి చేయాలి.

తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు.

నేటి గదర్ న్యూస్ :ఏన్కూరు, మార్చ్ 06: ఖమ్మం జిల్లా రైతాంగం రెండున్నర దశాబ్దాల పోరాట ఫలితమే గోదావరి జలాలు సాగర్ ఆయకట్టు కు తరలింపు అని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. గురువారం సీతారామ లింక్ కెనాల్ లో గోదావరి జలాలు ప్రవాహం ను తెలంగాణ రైతు సంఘం బృందం పరిశీలించింది.ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కృష్ణ బెసిన్ లో ఏర్పడిన నీటి సంక్షోభం, మరోవైపు కర్ణాటక ఆల్మట్టి ప్రాజెక్టు నిర్మాణం తో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయం కు గోదావరి జలాలు తరలింపు మాత్రమే సాగు నీరు అందించేందుకు అవకాశం ఉందని పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగాయి అన్నారు.ముఖ్యం గా మాజీ పార్లమెంటు సభ్యులు తమ్మినేని వీరభద్రం గోదావరి జలాలు సాధన మహా ప్రస్థానం పాదయాత్ర దుమ్ముగూడెం ప్రాజెక్ట్ అవశ్యకత, అవసరం యావత్తు జిల్లా ప్రజలు గుర్తించారు అని అన్నారు. 2005 డిసెంబర్ 31 న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దుమ్ముగూడెం ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేసి 20 సంవత్సరాల పూర్తి అయ్యింది, 2016 లో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు మరోసారి సీతారామ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు గత ప్రభుత్వ కాలం లో పూర్తి అయిన ప్రాజెక్టు పనులు అధారంగా గోదావరి జలాలు వినియోగం లోకి తీసుకువచ్చే ప్రయత్నం లో భాగంగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైరా శాసన సభ్యులు మాలోతు రాందాస్ నాయక్ కృషి మేరకు ఏన్కూరు వద్ద సాగర్ కెనాల్ కు గోదావరి సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ లింక్ చేసే సీతారామ లింక్ కెనాల్ మంజూరు చేసి పనులు పూర్తి స్థాయిలో కాకపోయినా ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న సాగునీటి సమస్యలు పరిష్కారం కోసం గోదావరి జలాలు బుధవారం రాత్రి సాగర్ ఆయకట్టు పరిధిలో పంటలకు తరలించడం అభినందనీయం అన్నారు, సీతారామ లింక్ కెనాల్ తో సత్తుపల్లి, మధిర నియోజకవర్గ పరిధిలో సాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్న సాగు భూములు కు ఉపయోగం అన్నారు, కృష్ణ జలాలపై ఉభయ తెలుగు రాష్ట్రాలు మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో గోదావరి జలాలు పాలేరు రిజర్వాయర్ కు తరలింపు చేయాల్సి అవసరం ఎక్కువగా ఉంటుంది అన్నారు.ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కు పాలేరు అనుసంధానం మాత్రమే మార్గం అని పాలేరు రిజర్వాయర్ అనుసంధానం చేసే సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ సత్వరమే పూర్తి చేయాలి అని డిమాండ్ చేశారు. సీతారామ ప్రాజెక్ట్ కెనాల్స్ వైరా నియోజకవర్గ పరిధిలో కారేపల్లి, ఇల్లందు నియోజకవర్గ పరిధిలో కామేపల్లి తోపాటు ఇతర మండలాల్లో సాగు భూములకు సాగు నీరు అందించాలి అని కోరారు, ఏన్కూరు మండలంలో సాగు భూములకు సీతారామ లింక్ కెనాల్ ప్రారంభం నుంచి సైడ్ పంట కాలువలు నిర్మాణం చేయాలి అని డిమాండ్ చేశారు లింక్ కెనాల్ నిర్మాణం చేసి సాగు నీరు విడుదల చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వైరా శాసన సభ్యులు మాలోతు రాందాస్ నాయక్ కృషి కి అభినందనలు తెలియజేస్తున్నాం అదే సమయంలో పాలేరు రిజర్వాయర్ అనుసంధానం అలస్యం అయితే మంత్రి తుమ్మల తోపాటు జిల్లా మంత్రులు భాధ్యత వహించాల్సి ఉంటుంది అని అన్నారు . సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ పాలేరు రిజర్వాయర్ అనుసంధానం చేసే వరకు ఆందోళన పోరాటం చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షుడు దొంతి బోయిన నాగేశ్వరరావు, తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భూక్యా లక్ష్మా, రైతు సంఘం మండల నాయకులు నండూరి శ్రీనివాసరావు, సిఐటియు జిల్లా నాయకులు వెల్పుల రాములు, మండల పరిషత్ కో ఆప్షన్ మాజీ సభ్యులు ఎస్ కె జానీ, వెంకటేశ్వరరావు, రాజు, బాబులాల్, మాడపాటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !