*వనం నుండి జన జాతరలోకి పగిడిద్ద రాజు*
*గద్దెలపై కొలువుదీరిన పగడద్దరాజు సమ్మక్క*
*కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టిన ఎస్ఐ రాజమౌళి*
*నేటి గద్దర్ న్యూస్ గుండాల*,వనం నుండి జన జాతరలోకి వచ్చిన పగిడిద్దరాజు, సమ్మక్క భర్త ఆయన పగిడిద్దరాజు జాతరను అరెం వంశీయులు ప్రతిఏటా ఎంతో వైభవంగా జాతరను నిర్వహిస్తారు గుండాల మండలం పరిధిలోని వేపల గడ్డ గ్రామ సమీపంలో ఈ జాతరను నిర్వహిస్తూ వస్తున్నారు. గురువారం ఉదయం వనం తెచుడితో జాతర ప్రారంభం అవుతుంది రాత్రి ఎంతో ఆటహాసంగా జాతర జరగడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున వనదేవతలను దర్శించుకునేందుకు తరలివస్తారు. రెండు రోజులపాటు జాతర ఎంతో వైభవంగా సాగనుంది. గుండాల ఎస్ఐ ఎం రాజమౌళి ఎటువంటి అవాంఛనీయత సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసి ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు జాతరకు వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని ఎస్ఐ రాజమౌళి సూచించారు
