రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 6:- సమాచార హక్కు చట్టం కింద సరైన సమాచారం ఇస్తారని మున్సిపల్ అధికారులకు తై బజార్ నిర్వాహకులు దరఖాస్తు పెట్టుకుంటే…సరైన సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు ఏకంగా తప్పుడు సమాచారం ఇచ్చి సమాచార హక్కు చట్టాన్ని తుంగలో తొక్కారు…ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం…మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో గత 10 సంవత్సరాల నుండి జరుగుతున్న తై బజార్ కు సంబంధించి సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం కోరగా రామాయంపేట మున్సిపాలిటీ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారని టై బజార్ నిర్వాహకులు వెంకుగారి శ్రీధర్ రెడ్డి,భూమ రమేష్ లు గురువారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు.తాము తై బజార్ కు సంబంధించి సమాచారం కోరగా 2015 -2016 సంవత్సరానికి గాను కాంట్రాక్టర్ రూ.6 లక్షల 95 వేలు చెల్లించగా,మున్సిపాలిటీ అధికారులు మాత్రం 7 లక్షల 20 వేలు చెల్లించినట్లు తెలిపారు.అలాగే 2017-2018 సంవత్సరానికి గాను 8 లక్షల 40 వేలు చెల్లించగా మున్సిపాలిటీ అధికారులు 11 లక్షలు చెల్లించినట్లు పేర్కొన్నారు.అలాగే 2018-2019 సంవత్సరానికి గాను 5 లక్షల 61 వేలు చెల్లించగా 10 లక్షల 20 వేల రూపాయలు చెల్లించినట్లు మున్సిపల్ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలా సమాచార హక్కు చట్టాన్ని తుంగలో తొక్కి తప్పుడు సమాచారం ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ దేవేందర్ తో పాటు మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్,మున్సిపల్ అకౌంటెంట్ శ్రీధర్ రెడ్డి లపై జిల్లా కలెక్టర్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
