నేటి గదర్ న్యూస్,ఖమ్మం ప్రతినిధి:
ఖమ్మం : కార్పెంటర్స్ జేఏసీ సమావేశం జేఏసీ కన్వీనర్ చిన్న బాణాల వీర బ్రహ్మచారి ఆధ్వర్యంలో వర్తక సంఘ భవనంలో జరిగింది . ఇందులో మూడు యూనియన్లు ఒకే తాటి మీదికి వచ్చి రేట్లు పెంచాలని 17/3/25 నుంచి 26/3/25 వరకు నిర్వహించనున్న కార్పెంటర్స్ బందు కార్యాచరణకి సంబంధించిన అభిప్రాయ సేకరణ తీసుకున్నారు . కావున ఈ పది రోజులు జరిగే బందును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో కార్పెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాణాల వీర బ్రహ్మచారి , ప్రధాన కార్యదర్శి సోమా నాగరాజు కుమార్ , కార్పెంటర్ మెస్ట్రీలు మరియు వర్కర్స్ యునియన్ అధ్యక్షులు దోనోజు పాపాచారి , ప్రధాన కార్యదర్శి దిగజర్ల వెంకన్న , ఖమ్మం పట్టణ దుగోడమిషన్ కార్పెంటర్ మేస్త్రి & వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు దొనోజు శ్రీనివాసాచారి , ప్రధాన కార్యదర్శి సందూరి నాగాచారి , కార్పెంటర్ జేఏసీ కన్వీనర్లు మరియు పలువురు ఖమ్మం నగర కార్పెంటర్ మేస్త్రీలు పాల్గొన్నారు .