నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, మార్చ్, 07: దమ్మపేట మండల కేంద్రంలో శుక్రవారం స్వచ్ఛభారత్ కార్యక్రమం.స్థానిక శాసనసభ్యులు జారె ఆదినారాయణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు వివిధ శాఖల సిబ్బందితో కలిసి నిర్వహించారు. ప్రధాన రహదారిపై రోడ్లకు ఇరువైపులా ఉన్న చెత్తాచెదారాలను తొలగించి రహదారిని పరిశుభ్రంగా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే మాట్లాడుతూ అందరి భాగస్వామ్యంతో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు, పరిశుభ్రత జీవితంలో ప్రతి వ్యక్తికి చాలా ప్రాముఖ్యమైనదని, మన పరిసరాలు శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యమే కాకుండా మన సమాజం కూడా శుభ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. కార్మిక సోదరులు కూడా ఎంతో కష్టపడి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు విశేషంగా కృషి చేస్తున్నారని, ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పరిసరాల పరిశుభ్రత అనేది కేవలం కొందరి బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు చెత్తను రోడ్లపై వేయకుండా నిర్దేశించిన ప్రదేశాలలో ఉంచి పంచాయితీ సిబ్బందికి సహకరించాలన్నారు. అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ఈ నియోజకవర్గాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
