టీబీసీ జేఏసీ టీజీ చైర్మన్ పెరుగు వెంకటరమణ యాదవ్.
నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.
ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక , ఆర్థిక , విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వేకు మద్దతుగా ఉండి బీసీలకు రావాల్సిన 42 శాతం వాటా కి చట్టబద్ధత సాధిద్దాం అనే నినాదంతో తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా బీసీ సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందాని , ఈ యొక్క సదస్సును జయప్రదం చేయాలని చైర్మన్ పెరుగు వెంకటరమణ యాదవ్ స్థానిక కార్యాలయము నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తెలియజేశారు . ఆయన మాట్లాడుతూ బీసీలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు మంత్రి వర్గానికి ధన్యవాదాలు తెలియజేశారు . విద్య , ఉద్యోగ , స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని క్యాబినెట్ ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేశారు . యావత్ బీసీ సమాజం ఈరోజు ముఖ్యమంత్రి కి అండగా నిలబడి మన 42% వాటాన్ని చట్టబద్ధత సాధించటం కొరకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు . కావున ఖమ్మం జిల్లాలో ఉన్న యావత్ బీసీ సమాజం ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ చీఫ్ అడ్వైజర్ చేకూరి చైతన్య , జి నరేందర్ , దరిపల్లి వీరబాబు , వల్లెపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు .