+91 95819 05907

మాదిగల ఉప వర్గీకరణ అమలు పరచాలనే కార్యాచరణలో షమిం అక్తర్ ఇచ్చిన నివేదికలో ఉన్న లోపాలను సవరించి అన్ని కులాలకు రిజర్వేషన్లు అందేలా చూడాలి

*మంత్రి వర్గంలో మాదిగలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలి..*

*ఎస్సీ వర్గీకరణను 3 గ్రూపులుగా కాకుండా ఎబిసిడి అనే 4 గ్రూపులుగా చెయ్యాలి.*

హావేళ్ళి ఘణపూర్ మండలం// మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి‌ మార్చి 07.

మెదక్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రోజు రాజ్యాంగ రిజర్వేషన్లు సామాజిక సమన్యాయం జరగాల్సిందే ఎమ్మార్పీస్ పోరాట సాధనలో అమరులైన మాదిగల కలలు సహకారవై విధంగా నిర్ణయాలు సాగాలన్నారు.మెదక్ జిల్లా కేంద్రం రాందాస్ చౌరస్తాలో మాదిగల డప్పుల ప్రదర్శన శుక్రవారం జరిగింది.చెట్లపల్లి యాదగిరి మాదిగ,ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అస్తరగల్ల బాలరాజ్ మాదిగ,
సర్గల పరశురాములు మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు చండీ శ్రీనివాస్ కోమ్ము శేఖులు మాదిగ,దండోల సామేలు,కొర్పుల రామస్వామి, చేగుంట మండల నాయకులు మాట్లాడుతూ
పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు దప్పులతో ప్రదర్శన సందర్భంగా హాజరై నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన వర్గీకరణను స్వాగతిస్తున్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన వర్గీకరణలో లోపాలు ఉన్నాయని వాటిని పునసమక్షించి తక్షణమే చట్టబద్ధతకు ముందే సవరించి శాస్త్రీయంగా రిజర్వేషన్లు అన్ని మాదిగ ఉపకులాలకు పంచాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ జస్టిస్ షమిం అక్తర్ గారి గడువును నెల రోజులు గత నెలలో పెంచడం జరిగింది. కానీ మాదిగలు ఈ సమయంలో నమ్మలేని స్థితిలో అప్రమత్తంగా ఉండాలని మంద కృష్ణ మాదిగ గారు ఈ నెల 4 నుంచి 10 వరకు కార్యాచరణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యాచరణను తుచ తప్పకుండా అమలు చెయ్యాలని పిలుపునివ్వడం జరిగింది. మాదిగ సమాజం కొంత మంది వర్గీకరణ వ్యతిరేక రాజకీయ ద్రోహులను గమనించాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మాదిగలను మోసం మరొకసారి చేసే పనిలో ఉందో లేదో మాదిగ మేధావులు ఉద్యోగ శ్రేయోభిలాషులుతెలుసుకోవాలన్నారు , జస్టిస్ షమిం అక్తర్ గారు మాదిగ, మాదిగ ఉప కులాలకు ఇచ్చిన 9% న్యాయమే అని మాదిగలకు మోసం చేసే కుట్రకు తెరలేపిందని, దీని కోసం కొంత మంది ఎస్సీ రిజర్వేషన్లను ఎత్తేయాలని కోణంలో గత రాజకీయ ద్రోహులను చేరదీసే ప్రయత్నాలు మానుకొని 11% పెంచాలని అన్నారు చిట్టా చివరి మాదిగ ఉపకులాలకు ద్రోహం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు ఇది మా ఎస్సీ సామాజిక వర్గానికి జరిగే అన్యాయమే అని అన్నారు మరో ఉద్యమం ద్వారా ప్రతిఘటిస్తామన్నారు మహాత్ముడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారి మీద అవక్కులు చెవాకులు పేలేలా ఒత్తిడి చేస్తుంది. దీనిని గమనించి మాదిగలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పెట్టుకున్న నమ్మకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిల పెట్టుకోవాలన్నారు మాదిగ ఉపకులాలు అన్ని రంగాల్లో రిజర్వేషన్ల ఉద్యోగాల ఎదుగుదల అడ్డుకునే అసూయ వ్యతిరేకులను రాజకీయ సమాధి కట్టాలని పిలుపునివ్వడం జరిగింది.ఈ ప్రదర్శనలో ఎమ్మార్పీఎస్ జిల్లా మండల నాయకులు పోచయ్య దుర్గయ్య ప్రవీణ్ నర్సింలు చంద్రయ్య దుర్గయ్య పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా కామదహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని అంబేద్కర్ రోడ్ లో ఆయా వార్డుల్లో ప్రధాన కూడళ్ళ వద్ద ఇంటింటికి వెళ్లి ప్రజలు పనికిరాని

Read More »

నందగోకుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- విద్యార్థి దశలో ఉపాధ్యాయ వృత్తిని అనుభవించడం గొప్ప అవకాశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు.ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో

Read More »

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

తెలంగాణలో జరగనున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి

నేటి గదర్ వెబ్ డెస్క్: *తెలంగాణలో జరగనున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి..* ఈ మేరకు ఎన్నికల అధికారులు అధికారిక ప్రకటన జారీ చేశారు. ఏకగ్రీవం అయిన ఎమ్మెల్సీలకు ధృవీకరణ

Read More »

 Don't Miss this News !