+91 95819 05907

2030 కల్లా లింగ సమానత్వాన్ని సాధించాలి… సిడబ్ల్యుసి చైర్ పర్సన్ భారతరాణి.

ఖమ్మం :నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతినిధి.మార్చ్ 7:- ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చిన లింగ సమానత్వం- 2030 నిజం చేయాలంటే మనమందరం ఐక్యంగా కృషి చేయాలని బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి భారతరాణి మహిళా లోకానికి పిలుపునిచ్చారు
అంతర్జాతీయ మహిళల దినోత్సవం ( మార్చ్ 8) సందర్భంగా యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ( ఎయిడ్) సంస్థ ఆధ్వర్యంలో స్థానిక టేకులపల్లి లోని గల మహిళా ప్రాంగణం నందు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జెండర్ ఈక్వాలిటీ స్ట్రాటజీ 2022 2025 పేరుతో ఐక్యరాజ్యసమితి రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక క్రింది క్షేత్రస్థాయి వరకు చేరినప్పుడే మహిళా సాధికారత లింగ సమానత్వం అనే లక్ష్యాలు నెరవేరుతాయి అన్నారు ఇప్పటికీ నాయకత్వంలో మహిళల కొరత ఉందని అన్నారు
పార్లమెంట్ స్థానిక సంస్థలు మేనేజ్మెంట్ పదవుల్లో కేవలం 27 నుంచి 36% మాత్రమే ఉండడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు
పేదరికం పని ప్రాంతం వివక్షత అసమానతలు అసమతుల్యత సామాజిక కట్టుబాట్లు సాంస్కృతిక ఆచారాలు విద్యా ఆరోగ్యం ఆహార భద్రత గృహహింస వీటికి తోడుగా నిధుల కొరత ఆడపిల్లలు మహిళల కోసం అమలు చేయని చట్టాలు ఇవన్నీ కూడా ప్రతిబంధకాలుగా మారాయని వీటన్నిటిని అధిగమించి 20 30 లక్ష్యాలను చేరుకోవడానికి సమిష్టి కృషి నిధుల పెంపుదల అవసరం ఎంతైనా ఉంది అని ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరు కలిసి అడుగు ముందుకు వేయాలని పిలుపునిచ్చారు
మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ వేల్పుల విజేత మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన మహిళా ప్రాంగణం నందు మహిళల కోసం యువతల కోసం అనేక రకాల కార్యక్రమాలను ట్రైనింగ్ ప్రోగ్రాములు ఏర్పాటు చేసి తమ కాళ్ళ మీద తాము నిలబడేలా చేయూతనందిస్తూ ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తున్నట్లు తెలిపారు వీలు కుదిరినప్పుడల్లా ఇటువంటి అవగాహన కార్యక్రమాలు లింగ సమానత్వం గురించి స్త్రీ సాధికారిక స్త్రీ కోసం పాటుపడిన మహిళా మణులను ఎందరినో స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో రాణించి పదవురికి ఆదర్శంగా నిలిచేలా పూర్తినిస్తున్నట్లు తెలిపారు
పోలీస్ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం బాధ్యులు నరసింహారావు మాట్లాడుతూ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మహిళా సహాయ కేంద్రాలు షీ టీమ్స్ భరోసా డయల్ 100 ల ద్వారా నిరంతరం రక్షణ కల్పిస్తూ మేమున్నాం అనే భరోసాని ఇస్తున్నట్లు తెలిపారు
సెల్ఫోన్ వినియోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని గృహహింస కూడా అక్రమ రవాణాకు ఒక కారణంగా మారుతుందని తెలిపారు అక్రమ రవాణా దారులు మహిళలు చిన్నపిల్లలు యువతను లక్ష్యంగా చేసుకొని అనేక రకాలుగా ప్రలోభాలు పెట్టి వారి జీవితాలను చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నిస్తారని కావున తెలిసిన తెలియని వ్యక్తుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు
ఎయిడ్ సంస్థ కోఆర్డినేటర్ కె శ్రీనివాస్ మాట్లాడుతూ మనదేశంలో ప్రతి రెండు నిమిషాలకు ఒక బాల్య వివాహం జరుగుతుందని 2030 కల్లా బాల్య వివాహ ముక్తు భారత్ లక్ష్యంగా జిల్లాలో అనుబంధ శాఖ అధికారుల సహాయ సహాయ సహకారాలతో నిరంతరం అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు . బాల్య వివాహాలను రూపుమాపినప్పుడే స్త్రీ సాధికారిక మరియు లింగ సమానత్వం సాధ్యమవుతుందని అన్నారు
బాలలకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కు ఫోన్ చేసి సహాయం పొందాలని తెలిపారు
అనంతరం మహిళా సాధికారతకు సంబంధించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ గోడ పత్రికను అతిథులు అందరి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఎయిడ్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్స్ కే శ్రీనివాస్ వి రాజేష్ టీం సభ్యులు మాధవి రాందాస్ కుటుంబరావు మరియు మహిళా ప్రాంగణం అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సుందరకాండ చిరు పుస్తక ఆవిష్కరణ

ఖమ్మం నగరంలో 56 డివిజన్ స్థానిక విజయనగర్ లో వేంచేసి ఉన్న శిరిడి సాయిబాబా మందిరం లో గురువారం మందిర చైర్మన్ మరియు వాస్తు రత్న డాక్టర్ ఫణిభట్ల రాజ లింగయ్య సిద్ధాంతి జన్మదిన

Read More »

కార్పెంటర్ల బంద్ పోస్టర్లు ఆవిష్కరణ

ఖమ్మం నగరంలో మూడు యూనియన్ల కార్పెంటర్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 17 సోమవారం నుండి 26 బుధవారం వరకు జరిగే “బందు” కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు . నగరంలో కార్పెంటర్ వృత్తిలో కొనసాగుతున్నటువంటి

Read More »

ముస్లింలకు ఈద్గా స్థలం కేటాయించాలి.

◆జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కు వినతిపత్రం అందజేత. వైరా:-నేటి గదర్ న్యూస్, మార్చి13:- వైరా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వినతిపత్రం అందించారు. తెలంగాణ రాష్ట్ర

Read More »

వైరా మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలి !

స్థానిక సంస్థలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి !! పనైనా చూపండి – తిండైనా పెట్టండి !!! సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు. వైరా:-నేటి గదర్ న్యూస్, మార్చి13:-మున్సిపాలిటీకి ప్రభుత్వం ప్రత్యేక

Read More »

అల్లు సతీష్‌ రెడ్డికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

నేటి గదర్ న్యూస్, పినపాక మండలం ఏడూళ్లబయ్యారం గ్రామంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కార్యకర్త అల్లు సతీష్‌ రెడ్డి ఇటీవల మరణించగా అతని దశదిన కార్యక్రమం గురువారం జరగింది. ఈ కార్యక్రమంలో పినపాక మాజీ

Read More »

మణుగూరు ఏరియా టి బి జి కె యస్ వైస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు, యం ఎల్ సి, జాగృతి వ్యవస్థాపకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు మణుగూరు ఏరియా టి బి జి కె యస్ వైస్

Read More »

 Don't Miss this News !