రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 8:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం నాడు రామాయంపేట పోలీస్ స్టేషన్ లో ట్రైనీ ఎస్సై సృజన మహిళా మూర్తుల గొప్పతనాన్ని వివరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు సమాజంలో సంకల్ప బలముతో ఏదైనా సాధించగలరని అన్నారు.మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తారని మహిళలు కష్టపడి ఇష్టంతో విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు.మహిళలు ఎక్కువ మట్టుకు చదువును మధ్యలోనే ఆపేసి కుటుంబ ఆర్థిక పరిస్థితులు వివాహాల దృష్ట్యా చదువును కొనసాగించలేక పోతునారన్నారని అన్నారు.కానీ తల్లిదండ్రులు మహిళల చదువుపై బాధ్యతగా దృష్టి పెడితే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని అన్నారు.వారి బంగారు భవిష్యత్తు తల్లిదండ్రులపై ఆధారపడి ఉందన్నారు.మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏది లేదని ఒంటరి ప్రయత్నం కాకుండా,సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.సమాజంలో మహిళలు ఇంటికి పరిమితం కాకుండా ముందడుగు వేసి రాణించాలని పిలుపునిచ్చారు.ఇది వ్యవస్థాగత అడ్డంకులను ఛేదించడానికి ఆర్థిక,వృత్తిపరమైన అభివృద్ధికి మహిళలు సామర్థ్యాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుందని అన్నారు.దేశంలో మహిళలను నాయకులుగా ఆవిష్కర్తలుగా సమాజంలో మార్పు తీసుకొచ్చేవారిగా అభివృద్ధి చెందే దిశగా వ్యవస్థలను రూపొందించాలన్నారు.ఈ సందర్భంగా మహిళా మూర్తులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
