ఖమ్మం : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక వేముల ఫంక్షన్ హాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో వాసవి వనిత క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వేముల శశికళ , చౌడవరపు సీతామహాలక్ష్మీ , కోశాధికారి బుద్ధ శ్రీదేవి , యర్రం సుజాత , మొహనదాసు , వాసవి వనిత క్లబ్ మాజీ అధ్యక్షురాలు ప్రతాపని శైలజ , దేవరశెట్టి శైలజ , వేముల అరుణ , దాచేపల్లి సృజన , వంకాయల స్వాతి , యర్రం స్వరూప , దేవరశెట్టి సుగుణ తదితరులు పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో మహిళలు వివిధ ఆట పాటలతో ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు . హోటల్ సత్యవైభవ్ మరియు హొటల్ సత్యకొనార్క్ యజమానులు ప్రతాపని శైలజ గిఫ్ట్ కూపన్లు అందించారు . మహిళలు ఇప్పుడు అన్ని రంగాలలో రాణిస్తున్నారు అని ఇంకా ప్రభుత్వాలు పురుషులతో సమానంగా హక్కులు కల్పించాలి అని కోరారు.
Post Views: 22