సమస్యల పరిష్కారానికి ప్రజలు కదిలి రావాలి…
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇల్లు నిర్మించి, ప్రెస్ క్లబ్ ను ఏర్పాటు చేయాలి…
సిపిఎం డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం.
నేటి గదర్ న్యూస్, వైరా ప్రతినిధి మార్చి 9:-వైరా మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 12న వైరా మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మహా ధర్నాకు సమస్యలతో బాధపడే ప్రజలందరూ కదిలి రావాలని సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం కోరారు. ఆదివారం సిపిఎం బ్రాహ్మణపల్లి శాఖ సమావేశం కొంగర సుధాకర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ విలీనమైన మున్సిపాలిటీ సమస్యలతో ప్రజలు విలయతాండవం చేస్తున్న ప్రభుత్వాలు అధికారులు సక్రంగా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన అనేక పథకాలకు మున్సిపాలిటీ పరిధిలో పేదలు అనర్లుగా ప్రకటించినది.ఇది సరైనది కాదని పేదలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 12 వేల రూపాయలు పథకాన్ని వర్తింపజేయాలని ఉపాధి హామీ పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. నియోజక కేంద్రం మరియు మండలాల్లో ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లు నిర్మించి, వైరా లో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు నివాస ప్రాంతాల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక దోమలు ఈగలతో ప్రజలు అనారోగ్యాలు పాలవుతున్నారని అన్నారు. ఉన్న ఉపాధి కోల్పోయిన ప్రజలు ఇంటి పన్ను పేరుతో నిర్బంధంగా వడ్డీలతో వసూలు చేయటం ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని తగదని మున్సిపాలిటీ అధికారులు ఈ ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సిపిఎం ప్రజల పక్షాన పోరాడుతుందని ప్రజలందరూ కూడా జరిగే ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. సమావేశంలో శాఖ కార్యదర్శి పైడిపల్లి సాంబశివరావు, గుత్తా వాసు, చిట్టూరి నాగేశ్వరరావు, కళావతి తదితరులు పాల్గొన్నారు.