నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతినిధి, మార్చి 9:-ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయంలో జరిగినటువంటి ఒక సమావేశంలో జూలూరుపాడు మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన ఇరప. రాధిక. బి ఎస్.పి పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి వస్తాను అనగా ఖమ్మం జిల్లా అధ్యక్షులు చెరుకుపల్లి. నాగేశ్వరరావు చేతుల మీదగా పార్టీ కండువా కప్పి బి.ఎస్.పి పార్టీలో కి సాదరంగా ఆహ్వానించడం జరిగినది. అనంతరం ఆమె మాట్లాడుతూ బీఎస్పీ పార్టీ కోసం కష్టపడి పనిచెసే కట్టర్ కార్యకర్తలను తయారు చేసి పార్టీకి అందిస్తానని ఆమె తెలియజేశారు.కార్యక్రమంలో జూలూరుపాడు మండల మహిళా నాయకురాలు భోగా లలిత, తంబర్ల నరసింహారావు, బుర్ర ఉపేందర్, ఈశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 52