★హాజరైన జాతీయ అధ్యక్షులు బి.వి రాజు
భద్రాచలం
దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా మహిళల ఆటపాటలతో ఉత్సాహభరిత వాతావరణం లో కొనసాగాయి. ముందుగా జ్యోతి ప్రజ్వాలను జాతీయ అధ్యక్షులు బివి రాజు జిల్లా అధ్యక్షురాలు పూజల లక్ష్మి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆటపాటలతో మహిళలు చిన్న పెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా 60 సంవత్సరాలు నిండిన మహిళ మూర్తులను సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు అనంతరం పూజల లక్ష్మీ అధ్యక్షతన జరిగిన మహిళా ప్రతినిధుల సభలో జాతీయ అధ్యక్షులు బివి రాజు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించాలని కోరారు. దేశంలో రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకీ పెరిగిపోతున్న దాడులకు వ్యతిరేకంగా మహిళ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్నామని అదేవిధంగా మహిళా సాధికారికత కోసం అనేక రూపాలలో సహాయ సహకారాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రధానంగా ఒంటరి మహిళలకు అండగా దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ నిలిచి వారి సమస్యలపై వీలైనంతవరకు పనిచేస్తుందని తెలిపారు. మహిళలకు క్రీడా పోటీలు నిర్వహించడంతోపాటు అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుందని అన్నారు. దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు అయిన పూజల లక్ష్మి సంఘాన్ని బలోపేతం చేయడానికి శక్తివంచన లేఖన కృషి చేస్తుందని ఆమె బాటలో మహిళలందరూ పైనుంచి సంఘం అభివృద్ధికి పాటుపడాలని మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరూ సుఖ సంతోషాలతో గడపాలని ఉద్దేశంతో దిశ ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులతో పాటు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. అనంతరం జిల్లా అధ్యక్షురాలు అయిన పూజ లక్ష్మికి జ్ఞాపక బివి రాజు అందించారు