నేటి గద్దర్ డిజిటల్ న్యూస్ , చింతకాని ప్రతినిధి,
ఖమ్మం వినోద థియేటర్లో లో ప్రదర్శించినటు వంటి చావా చిత్రాన్ని చింతకాని మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కొండ గోపి ఆధ్వర్యంలోనాయకులతో చిత్రాన్ని వీక్షించడం జరిగింది ఈ చిత్రంలో శివాజీ మహారాజ్ తనయుడు సంభాజీ మహారాజ్ ఆనాడు మొగలాయులపై చేసినటువంటి పోరాటాన్ని కన్నులకు కట్టినట్లుగా చిత్రీకరించి నేటి యువతకు స్ఫూర్తినిచ్చారు. హిందూ మత స్వరాజ్య స్థాపన కోసం మరియు దేశ భక్తి ప్రేరేపితమైన సినిమాను ప్రతి పౌరుడు తప్పకుండా వీక్షించాలని విజ్ఞప్తి చేశారు నేటి తరుణంలో విభిన్న సినిమాలు వస్తున్న సమయంలో ఈ చావా‘సినిమా రావడం గర్వంగా ఉందన్నారు సమాజానికి ఇంతటి స్ఫూర్తిదాయకమైన ఈ సినిమాను తీసిన చిత్ర బృందానికి నిర్మాతలకు నటీనటులు అందరకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ మరొక్కసారి ప్రతి పౌరుడు కూడా ఈ చిత్రాన్ని చూడాలని విజ్ఞప్తి చేశారు.ఈ చిత్రాన్ని వీక్షించిన వారిలో బీజేపీ కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.*
