రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 9:- మెదక్ జిల్లా రామాయంపేట నెహ్రు యువ కేంద్రం యువజ్యోతి స్పోర్ట్స్ అండ్ యూత్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమాలు 60 మంది విద్యార్థినిలు ప్లే కార్డ్స్ బ్యానర్లతో పట్టణంలో నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా స్పోర్ట్స్ క్లబ్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మాట్లాడుతూ మహిళలే మానవజాతికి పట్టుకొమ్మలని పునాదులని ఆడపిల్లలను కాపాడుకోవాలని మహిళలకు రక్షణ ఇవ్వాలని అన్నారు.యువ కేంద్రం సిద్దిపేట వారి ఆదేశాలతో కేంద్ర యువజన సర్వీసులు ఉపాధి క్రీడలు అవగాహన శాఖ వారి తరఫున స్థానిక రామాయంపేట యువజ్యోతి స్పోర్ట్స్ అండ్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో యువభారత్ యువ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా మహిళ దినోత్సవ సందర్భంగా మహిళల హక్కులు రక్షణ అవగాహన స్ఫూర్తి కోసం ర్యాలీ నిర్వహణ కార్యక్రమం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ కు చెందిన డిగ్రీ కాలేజ్ విద్యార్థినీలు 60 మంది పాల్గొన్నారు. రామాయంపేట మెదక్ రోడ్ లోని అంబేద్కర్ విగ్రహం నుండి ర్యాలీగా కొనసాగి 44 రహదారి పై మహిళలను రక్షించాలి బాలికలను కాపాడాలి మహిళా హక్కులను ప్రోత్సహించాలని నినాదాలు చేశారు.జాతీయ జెండాలతో సోషల్ వెల్ఫేర్ కాలేజీ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల పిడి స్పందన యువజ్యోతి స్పోర్ట్స్ అండ్ యూత్ క్లబ్ సభ్యులు కుస్తీ అభిరామ్ నితిన్ భాను ప్రసాద్ భానుదాస్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
