★సంక్షేమ పరిషత్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు V. C. దొర
*నేటి గద్దర్ న్యూస్ గుండాల*,భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం సీతారామ ప్రాజెక్టు నిర్మాణం వలన పినపాక,కొత్తగూడెం,ఇల్లందు,
భద్రాచలం నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆశపడ్డరు కానీ వారి ఆశ నిర్వీర్యం చేస్తూ,ఏజెన్సీ ప్రాంతానికి చుక్క నీరు కూడా ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాంత నీళ్ళను తరలిస్తూ ఖమ్మం లోని పొంగులేటి భూములకు,సత్తుపల్లి లోని తుమ్మల భూములకు మరియు మధిర లోని భట్టి భూములకు నీళ్ళను తరలిస్తున్నారు తప్ప మా ఆదివాసి ప్రాంత భూములకు కాదు అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ప్రాంత హక్కుల ను కాపాడవలసిన ఇల్లందు పినపాక భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యేలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఆదివాసుల రక్షణ మాట్లాడకపోగా ప్రభుత్వానికి వత్తాసు పలికే విధంగా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు.
కాలువలు తవ్వినా భూమి మనది.కాని ఒక్క బొట్టు నీటి చుక్క ముట్టలేని మన జిల్లా ప్రజల పరిస్థితి.ఇవాళ మంత్రుల ఇలాకాలు అయిన ఖమ్మం. సత్తుపల్లి. మధిర. లకు తరలించడం మన జిల్లా రైతంగాన్ని విస్మరించినట్లే. జిల్లా లొ నలుగురు ఆదివాసీ ఎమ్మెల్యేలు ఉండి ఒక్క బొట్టు నీటి చుక్క వారి నియోజక వర్గాలకు తరలించకపోవడం పెత్తందారి వ్యస్థకు తల ఒగ్గిన రీతి కనిపిస్తుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సంబశివారావు మా జిల్లా కి సీత రామ నీళ్లు ఇవ్వాలి అని మంత్రుల ముందు ఎంతో నిబ్బరంగా డిమాండ్ చేసిన మన మిగతా ఎమ్మెల్యేలు స్పందించకపోవడం మన అణిచివేతకు పునాదులు బలపడ్డట్టే అని ఆవేదన వ్యక్తం చేశారు.శివరాకరుణ సీత రాములు కుడా మా భద్రాద్రి జిల్లా వాస్తవ్యులే కాని వారి పేరుమీద ప్రాజెక్టు కట్టి మా గోంతే ఎండగొట్టటం ఇది సహించిదే లేదు మన జిల్లా రైతులందరి నీళ్లు అందె వరకు అన్నదాత శుఖీభవ పాదయాత్ర జిల్లా వ్యాప్తంగా చేస్తాం.జిల్లా కార్యాలలు ముట్టడిస్తాం అని హెచ్చరించారు
