రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 10:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మహాత్మ సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి వేడుకలను బీసీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే మహిళల చదువు కోసం ఆమె ఎంతగానో కృషి చేసిందన్నారు.మహిళల చదువు కోసం అహర్నిశలు కృషిచేసి చదువు నేర్చుకొని ఎంతోమందికి మహిళలకు ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు.సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు.ఆమె చేసిన పోరాట ఫలితమే ఈ రోజు ఆమె వర్ధంతి,జయంతి ఉత్సవాలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.అలాగే మహిళలు వంటింటికి పరిమితం కాకుండా సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకొని మహిళలు ప్రతి ఒక్కరు ఆమె అడుగుజాడల్లో నడుచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మహాత్మ పూలే ఫౌండర్ పోచమ్మల అశ్విని శ్రీనివాస్,అబ్రమైన గంగ రాములు,శశికాంత్,సుంకోజు దామోదర్,అల్లాడి వెంకటేష్,దేవుని రవి,రెడ్డమైన నరేష్,సురేష్ నాయక్,పిట్ల శ్రీశైలం,పుట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
