పినపాక మండలం ఈ. బయ్యారం గ్రామానికి చెందిన తెలంగాణ జన సమితి పార్టీ మండల నాయకులు బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి గారిని పినపాక మండల నూతన తెలంగాణ జన సమితి పార్టీ మండల అధ్యక్షుడిగా బుధవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో తెలంగాణ జన సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ ప్రొఫెసర్ కోదండరాం గారి ఆదేశాల మేరకు పార్టీ జిల్లా అధ్యక్షులు బి. దేవదానం గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా నియమిస్తూ పత్రాన్ని అందించడం జరిగింది.
ఈ సందర్భంగా పినపాక మండలం తెలంగాణ జన సమితి నూతన మండల అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ
నన్ను పినపాక మండల అధ్యక్షులుగా తెలంగాణ జన సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీ కోదండరాం గారి ఆదేశాల మేరకు పార్టీ జిల్లా అధ్యక్షులు బి.దేవదానం పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ పగడాల కరుణాకర్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో నియమించడం జరిగింది అన్నారు, పార్టీలో నన్ను గుర్తించిన అవకాశం ఇచ్చినందుకు వారికి వారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు పార్టీలో క్రమం తప్పకుండా శ్రాయ శక్తుల కృషి చేసి పార్టీ బలోపేతం చేయడానికి అహర్నిశలు శ్రమిస్తానని ఆయన తెలియజేశారు, మండలంలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ప్రొఫెసర్ కోదండరాం గారి దృష్టికి తీసుకువెళ్లి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి గారిని సమస్యల పరిష్కరించడం కోసం కృషి చేస్తామన్నారు , త్వరలోనే ప్రొఫెసర్ కోదండరాం గారితో కలిసి జిల్లా పార్టీ ముఖ్య నాయకులు తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవనున్నట్లు ఆయన తెలిపారు…