నేటి గదర్ న్యూస్, వైరాప్రతి నిధి, మార్చి 13:-ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల రీజినల్ సెక్రటరీగా కేజీ సిరిపురం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మొహమ్మద్ ముజీబ్ ఎన్ని కయ్యారు. వారి నియామకం పట్ల పలువురు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రెండు జిల్లాల్లో ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటూ సంఘ ఆశయాలను సాధించడానికి మరియు సంఘ పటిష్టతకు కృషి చేస్తానన్నారు .అదేవిధంగా తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించినందుకు రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు .
Post Views: 14