రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) 13:- హోలీ పండుగను ప్రజలు ప్రశాంతంగా సంతోషంగా జరుపుకోవాలని రామాయంపేట సీఐ.వెంకట రాజాగౌడ్ ప్రకటనలో తెలిపారు.హోలీ పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పండగను ప్రశాంతంగా,ఆనందంగా జరుపుకోవాలని పేర్కొన్నారు.సహజ సిద్ధమైన రంగులను ప్రజలు వాడాలని సూచించారు.గుర్తు తెలియని వ్యక్తులపై,వాహనాలపై రంగులు చల్లితే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.బహిరంగ ప్రదేశాల్లో రోడ్లపై ఇతరులను అసభ్యంగా ప్రర్తించడం,మద్యం మత్తులో అల్లర్లు సృష్టించడం,మద్యం సేవించి వాహనం నడపడం చట్ట విరుద్దమని తెలిపారు.శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 100 నంబర్ కు కాల్ చేయాలని సూచించారు.
Post Views: 60