★ సర్వ బుగ్గిమయం
★ స్పందించని ఫైర్ సిబ్బంది
★ స్థానికుల సహాయంతో మంటలు ఆర్పాటు
★ అనాధగా మారిన బాధిత వ్యక్తి
★ ప్రభుత్వం ,దాతలు ఆదుకోవాలని వేడుకోలు
నేటి గదర్ న్యూస్, మణుగూరు మండలం రూరల్ : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరిల్లు దగ్దం ఐన సంఘటన మణుగూరు మండలం సాంబాయిగూడెం చోటుచేసుకుంది.గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.సాంబాయిగూడెం గ్రామానికి చెందిన పోలేపాక గిరిబాబు అ నే వ్యక్తి పూరి గుడిసె కు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు వ్యాపించడంతో కాలిపోయింది.ఇంటిలోనే గృహప్రకారణాలు దగ్ధమైనట్లు బాధిత వ్యక్తి రోదిస్తూ తెలిపారు. వీటి విలువ వేలలో ఉంటుంది . ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ప్రభుత్వం, దాతలు నిరుపేద ఐన తనను ఆదుకోవాలని పోలేపాక గిరిబాబు కోరారు.కాగా ఫైర్ స్టేషన్ కి సమాచారం ఇచ్చినప్పటికీ స్పందించలేదని బాధిత వ్యక్తి తెలిపారు. స్థానికుల సహాయంతో మంటలను కడుపులోకి తీసుకువచ్చారు.









