ఖమ్మం ఎన్ఎస్పి గట్టయ్య సెంటర్ రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం రోటరీ సర్వీస్ సెంటర్ లో 60 మంది దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ పాదాలను పంపిణీ చేయడం జరిగింది . దీనికి అమెరికాలోనే ఏకం సంస్థ వారు 2,61,000 వేల రూపాయలను సహాయంగా అందించారు . కృత్రిమ పాదాలతో పాటు బూట్లు కూడా ఇవ్వడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జీవి మల్ అధినేత గుర్రం ఉమామహేశ్వరరావు , మహేశ్వరి గోల్డ్ అధినేత అరవపల్లి అశోక్ పాల్గొని రోటరీ సేవలను కొనియాడారు . ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ మల్లాది వాసుదేవ్ , రోటరీ క్లబ్ అధ్యక్షులు నల్లమోతు రవీంద్రనాథ్ , కార్యదర్శి దొడ్డపనేని సాంబశివరావు , కో ఆర్డినేటర్ పసుమర్తి రంగారావు , ఏ జి భూషణ్ రావు , మేకల బిక్షమయ్య , నాగేశ్వరావు , సుధాకర్ , ముత్తయ్య తదితరులు హాజరయ్యారు .
Post Views: 164









