ఖమ్మం మార్చి 16 ముస్లింల ప్రేమ అభిమానం ఆప్యాయతలే ఈ స్థానంలో నిలబెట్టాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం తనను కలిసిన ఖమ్మం రూరల్ , ఎదులాపురం మున్సిపాలిటీ ముస్లిం మైనార్టీలను ఉద్దేశించి , తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ముస్లింలు తనను ప్రేమ, అభిమానం ఆప్యాయతలు ఏ విధంగా పంచారో శీనన్న గూడా అదేవిధంగా వారి కష్టాలలో, అవసరాలలో పిలిచే పలికే వ్యక్తిగా గతంలో ఎలా ఉన్నాను అలాగే ఉంటానని పేర్కొన్నారు. ఖమ్మంలో రూరల్ మండలంలో , ఏదులాపురం మున్సిపాలిటీలో ముస్లింలు చెప్పిన సమస్యలను త్వరిత గతీతంగా రెవెన్యూ శాఖ నాదే కాబట్టి ,పరిష్కరిస్తానని హామీలు ఇచ్చారు. మసీదు ,షాదీ ఖానా విషయాలు ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని , అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా ఏదో ఒక రోజు వచ్చి, ఇఫ్తార్ విందు ఏర్పాటుపై మాట్లాడుతానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎదులాపురం మున్సిపాలిటీ , కమ్మ రూరల్ మండలం జే ఏ సి నాయకులు సయ్యద్ సాదిక్ అలీ , మహమ్మద్ గౌస్ పాషా , మహమ్మద్ హుస్సేన్ , షేక్. నజిరుద్దీన్ , మొయిన్, హసన్, యాసీన్ , జబ్బార్, ఆరిఫ్, రషీద్ ,ఖలీల్ , జానీ ,జావేద్, జాఫర్, యాసిన్, నవాబ్ ,షరీఫ్ ,రఫీ ,జానీ ఖాన్ ,మౌలాలి ,మిర్జావలి ,యూసుఫ్, మస్తాన్ ,ఖాదర్ ,అబూబకర్, మదార్ , మహబూబ్ సాహెబ్ , బాజీ లు ఎదులాపురం మున్సిపాలిటీ , ఖమ్మం రూరల్ మండలం లోని ముస్లిం మైనార్టీ సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించారు.









