◆ఉమ్మడి చేగుంట నార్సింగ్ మండల కేంద్రాలలో బిఆర్ఎస్ నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.
నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) మార్చి 16.
తెలంగాణ లో దళితులను గౌరవించని పార్టీ బిఆర్ఎస్. అని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.
దళిత స్పీకర్ ని అధ్యక్ష అని పిలవాల్సి వస్తుందని శాసనసభకు హాజరుకాని కేసీఆర్
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై శాసనసభలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా శాసనసభ్యుడు గుంతకల్ల జగదీశ్ రెడ్డి మరియు కేటీఆర్ దిష్టిబొమ్మలను చేగుంట మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద దహనం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ శాసనసభలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకల్ల జగదీశ్ రెడ్డి, ఏకవచనంతో మాట్లాడుతూ ఆగౌరవపరిచి, శాసనసభ సంప్రదాయాలను తుంగలో తొక్కినందుకు, జగదీష్ రెడ్డికి మద్దతుగా నిలిచిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశామని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ మొదటి నుండి దళిత వ్యతిరేక పార్టీ అని తెలిపారు. ఉద్యమ సమయంలో దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మోసం చేసి కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తా అని చెప్పి మోసం చేసింది కెసిఆర్ ని తెలిపారు. ఉపముఖ్యమంత్రిగా ఉన్న తాటికొండ రాజయ్య ని అకారణంగా మంత్రివర్గం నుంచి తొలగించి దళితుల మీద ఉన్న అక్కసును చూపింది బిఆర్ఎస్ పార్టీ అని తెలిపారు.దళితుడైన గడ్డం ప్రసాద్ శాసనసభ స్పీకర్ గా కాంగ్రెస్ పార్టీ నియమిస్తే అధ్యక్షా అని సంబోధించాల్సి వస్తుందని కెసిఆర్ శాసనసభ సమావేశాలకు హాజరు కావడం లేదని తెలిపారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గుంతకల్ల జగదీశ్ రెడ్డి ని అసెంబ్లీ నుండి బహిష్కరించడమే కాకుండా అతని యొక్క సభ్యత్యాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ మెదక్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు జంగాల గోవర్ధన్, రాజేష్, ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాస్ ఎస్టి సెల్ అధ్యక్షులు ఫకీర్ నాయక్ ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్, ఉపాధ్యక్షులు మద్దూరి రాజు ,యువ నాయకులు సండ్రుగు శ్రీకాంత్ ,దుబ్బాక అసెంబ్లీ యువజన కార్యదర్శి సాయి కుమార్ గౌడ్, జిల్లా మహిళా నాయకురాలు కురుమ లక్ష్మి, సొమ్ల తండ భద్య నాయక్, రాకేష్ ,రవీందర్ నాయక్ ,గణ్య నాయక్ ,భాషా ,రాజు తదితరులు పాల్గొన్నారు.









