+91 95819 05907

చదువుల్లో వెనకబడ్డారని ఇద్దరు పిల్లలను చంపేసి… ఆపై తండ్రి ?

*కన్న బిడ్డల ప్రాణం తీసిన కసాయి, సైకో తండ్రి*

కన్నబిడ్డలను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన తండ్రి.. ఎందుకో పిల్లల చదువులపై బెంగపడి ప్రాణాలు తీశాడు.అత్యంత క్రూరంగా వారి జీవితాలను చిదిమి వేశాడు. కాళ్లూ చేతులను తాళ్లతో కట్టేసి నీళ్ల బకెట్లలో తలలు ముంచి ఊపిరి తీశాడు. చివరకు తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

చదువుల్లో వెనకబడ్డారని ఇద్దరు పిల్లలను చంపేసి ఆపై తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఈ దారుణ ఘటన కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.పిల్లల కాళ్లు చేతులు తాళ్లతో కట్టి నీళ్ళల్లో ముంచి తండ్రి చంద్ర కిషోర్ చంపిన తీరు అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది.

ఇద్దరు పిల్లలను చంపి తర్వాత తాను ఉరివేసు కుని ఆత్మహత్య చేసు కున్నాడు.పోటీ ప్రపంచంలో పిల్లలకు భవిష్యత్తు లేదని అందుకే వారిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు చంద్రకిషోర్ సూసైడ్ నోట్ లో రాశాడు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్ కాకి నాడ జిల్లా వాకల పూడి లోని ONGC ఆఫీస్‌లో అసిస్టెంట్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు.

అయితే పిల్లలు చదువులో వెనుకబడి ఉండటంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.హోలీ పండుగ సందర్భంగా భార్య తనూజను ఇద్దరు కుమారులు జోషిల్ నిఖిల్‌ను తీసుకుని చంద్రకిశోర్ తన ఆఫీస్‌కి వెళ్లాడు.అనంతరం పిల్లలకు యూనిఫాం కొలతలు తీయించడానికి టైలర్ వద్దకు తీసుకెళ్తున్నానని చెప్పి భార్యను ఆఫీస్‌ లోనే ఉండమని నమ్మించి.ఇద్దరు పిల్లలను తీసుకోని చంద్రకిశోర్ ఇంటికి వెళ్లాడు.

ఇద్దరు పిల్లలను ఇంటికి తీసుకెళ్లిన తర్వాత చంద్రకిషోర్ పిల్లల కాళ్లు చేతులు కట్టేసి నిండా నీళ్లు ఉన్న బకెట్లలో తలలు ముంచి హత్య చేశాడు. ఆపై తాను ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఎంతసేపటికీ భర్త రాకపో వడంతో తోటి ఉద్యోగులతో కలిసి తనూజ ఇంటికి వెళ్లింది.

కిటికీ నుంచి చూడగా భర్త, పిల్లలు విగతజీవులుగా కనిపించడంతో కన్నీరు మున్నీరుగా విలపించింది.. ఇద్దరు పిల్లలను హత్య చేసి చంద్రకిషోర్ ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

*పోటీ ప్రపంచంలో పిల్లలకు భవిష్యత్తు లేదని, అందుకే వారిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్*

*NOTE*

*పోటీ ప్రపంచంలో పోటీ పడ్డప్పుడే ప్రతిభ బయటకి వస్తుంది.పిల్లల్లో ఉన్న టాలెంట్ ని గుర్తించరు.మార్కులు ర్యాంకులు ప్రైజులు మెడల్స్ అంతేనా జీవితం…?*
*వాళ్ళు గీసే గీతల్లో కూడా అద్భుతమైన కళాఖండాలు ఉంటాయి.*
*ఆడే పాడే వయస్సులో అల్లరిఉంటుంది సరైన మార్గంలో పెట్టి పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులది సైకోలా పిల్లలు ప్రాణాలు తీసి పిరికి వాడిగా ప్రాణాలు తీసుకోవడం దురదృష్టకరం……🥲*

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !