ఛత్తీస్ గఢ్
దండకారణ్యంలో మరోసారి కాల్పుల మోత మోగింది. దంతెవాడ బీజాపూర్ మావోయిస్టులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు దంతెవాడ పోలీసులు ఇవాళ తెల్లవారుజామున ఆకస్మికంగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే వారికి మావోయిస్టులు తారసపడగా.. ఒక్కసారిగా పోలీసులు ఫైర్ ఓపెన్ చేశారు. దీంతో ఇరుపక్షాల మధ్య భీకరంగా ఎదురుకాల్పులకు కొనసాగాయి. *ఈ ఎన్ కౌంటర్ మావోయిస్టు మహిళా అగ్రనేత రేణుక తీవ్రమైన బుల్లెట్ గాయాలతో స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయింది.* మిగతా దళ సభ్యులు పోలీసులు కళ్లుగప్పి అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఈ మేరకు దంతెవాడ పోలీసులు *రేణుక మృతదేహంతో పాటు తుపాకీ, మందుగుండు సామాగ్రి, బుల్లెట్లు స్వాధీనం* చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు..
Post Views: 21