రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 31:- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని గోల్పర్తి గ్రామంలో శ్రీ కోటమ్మ జాతర ఉత్సవాలకు ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఆదివారం నాడు గ్రామంలో మహిళలు ఊరేగింపుగా బోనాలు తీసుకెళ్లి అమ్మవారికి పెద్ద ఎత్తున సమర్పించారు.అదేవిధంగా జాతర ఉత్సవాల్లో భాగంగా సోమవారం నాడు గ్రామంలో యువకులు పెద్దలు ఆటపాటలతో డప్పు చప్పుల మధ్య వృత్యాలు చేస్తూ పురవీధుల గుండా బండ్ల ఊరేగింపుతో ప్రారంభమై కోటమ్మ దేవాలయం వరకు భారీ సంఖ్యలో ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు.ఈ జాతరలో మహిళలు పిల్లలు పెద్దలు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.జాతర ఉత్సవాలకు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు.ఆనంతరం శ్రీ కోటమ్మ దేవాలయం చుట్టూ బండ్ల ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ జాతర ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,యువకులు,గ్రామ ప్రజలు వివిధ గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









