నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.
ఖమ్మం : ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో రిటైర్డ్ పద్మశాలి ఉద్యోగుల విభాగం వారి తృతీయ వార్షికోత్సవం శ్రీ దుస్స సత్యనారాయణ అధ్యక్షతన జరిగినది . మహిళలచే జ్యోతి ప్రజ్వలన చేసి మార్కండేయ స్వామి చిత్రపటానికి పూలమాలవేసి ప్రారంభించడం జరిగింది . ఈ కార్యక్రమంలో భాగంగా శరత్ మ్యాక్సీవిజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో కళ్ళ పరీక్షలు నిర్వహించారు . ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీ వేముల రాజకుమార్ మోకాళ్ళ నొప్పులు , కండరాల సమస్యలు నివారణ గురించి చక్కగా వివరించారు . అనంతరం ఏకపాత్రాభినయ నాటిక , బద్ధకస్తుల భారతం పై చిన్న నాటికను ప్రదర్శించారు . రిటైర్ అయిన ఉద్యోగులను సన్మానించారు . ఇటీవలే మరణించిన నిరుపేద పద్మశాలి 2 కుటుంబాలకు (6000 + 6000) చొప్పున 12000 వేల రూపాయలను అందజేశారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారత పద్మశాలి సంఘం కార్యదర్శి బొమ్మ రాజేశ్వరరావు , జిల్లా ప్రధాన కార్యదర్శి చిలకమర్రి శ్రీనివాస బాబు , రాష్ట్ర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు జెల్లా లక్ష్మీనారాయణ లు పాల్గొన్నారు . ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ కుల బాంధవులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ రిటైర్డ్ ఉద్యోగ విభాగం వారు జిల్లా సంఘానికి అనుబంధంగా ఉంటూ ప్రతి కార్యక్రమానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని వారు భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ అభినందించినారు . ఈ కార్యక్రమానిలో జిల్లా రిటైర్డ్ ఉద్యోగ విభాగం ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి కొండలరావు , ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు పెండెం జనార్దన్ , బండారు శ్రీనివాసరావు , యువజన విభాగ అధ్యక్ష కార్యదర్శులు పులిపాటి సంపత్ కుమార్ , చందా వీరభద్రం , మహిళా విభాగ అధ్యక్షులు శ్రీమతి గడ్డం సునీత , కె.గోపాలరావు , ఎం.సీతారామయ్య , వై.గురులింగం , కె.నాగేశ్వరరావు , పి.సత్యనారాయణ , అశోక్ , గుడ్ల శీను , పెంటి వెంకటేశ్వర్లు , నవీన్ , కూరపాటి సతీష్ , శ్రీను పాల్గొన్నారు .