+91 95819 05907

అకారణంగా విద్యార్థి సంఘ నాయకులను నిర్బంధించడం హేయమైన చర్య:PDSU

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఎలాంటి కారణాలు లేకుండానే పి డి యస్ యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ, పి డి యస్ యూ జిల్లా నేతలు బానోత్ నరేందర్,మునిగల శివప్రశాంత్,ఎ.పార్థసాథి లతో పాటు ఇతర విద్యార్థి సంఘ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం హెయమైన చర్య అని పి డి యస్ యూ ఇల్లందు పట్టణ అధ్యక్షులు బి.సాయి,పట్టణ నాయకులు అబ్దుల్ గని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరిగానే నేడు ప్రజాపాలనంటూ ఊదరగొడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడతానంటూ ప్రగాల్భాలు పలికిన రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత తన నిజస్వరూపం బట్టబయలు అవుతుందని వారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘ నాయకుల ఇండ్లకు అర్ధరాత్రి సమయంలో వెళ్లి భయభ్రాంతులకు గురిజేస్తూ అనేకమందిని తెల్లవారుజామునే పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడం ప్రజాపాలన ఎట్లా? అవుతుందని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు,ప్రదర్శనలు, నినాదాలు చేయరాదని అప్రజాస్వామికమైన సర్కులర్ తో ఆంక్షలు విధించడం, మరోపక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని ఆక్రమించుకొని కార్పొరేట్ సంస్థలకు దార దత్తాం చేసేందుకు యూనివర్సిటీ విద్యార్థులపై నిర్బంధాన్ని ప్రయోగించి మాట్లాడకుండా గొంతులు నొక్కేస్తున్న క్రమంలో విశ్వవిద్యాలయాల విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాల మద్దతు లభిస్తుందనే భయంతోనే ఈ విధమైనటువంటి చర్యలకు పూనుకుంటున్నారని వారు తెలిపారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ నియంతృత్వ పోకడలను మానుకొని ఓయూ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో నిర్బంధ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మణుగూరులో ఒకేరోజు ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తుల మరణం – పట్టణంలో తీవ్ర విషాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తులు ఈరోజు అనారోగ్య కారణాలతో మరణించడం పట్టణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పట్టణ అభివృద్ధికి, వ్యాపార రంగానికి తమదైన సేవలు

Read More »

వెలుగుల బాటలో కేశప్పగూడెం: సర్పంచ్ పట్టుదలకు దక్కిన ఫలితం!

​లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం.. 25 కేవిఏ కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 06: అశ్వరావుపేట మండలంలోని కేశప్పగూడెం గ్రామ పంచాయతీలో ఏళ్ల తరబడి

Read More »

హత్య కేసులో నిందితులు అరెస్టు.

*హత్య చేసిన నిందితుల వివరాలను వెల్లడించిన ఎడుళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు* నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు గ్రామంలో ఫిబ్రవరి 28వ తారీఖున అర్ధరాత్రి కోవాసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య

Read More »

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

 Don't Miss this News !